బిగ్ బాస్ హౌస్లో బోల్డ్ కంటెంట్ విష్ణుప్రియ, రీతూచౌదరి ఎంట్రీతో హీటెక్కనున్న షో Asianet News Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Bigg Boss 8 Telugu Contestants Final List
    #biggboss #vishnupriya #rithuchowdary #contestants #nagarjunaakkineni
    బిగ్ బాస్ హౌస్లో బోల్డ్ కంటెంట్.. విష్ణుప్రియ, రీతూ చౌదరి ఎంట్రీతో హీటెక్కనున్న షో!
    బిగ్ బాస్ తెలుగు 8కి రంగం సిద్ధమైంది. బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హాట్ యాంకర్స్ రీతూ చౌదరి, విష్ణుప్రియ హౌస్లోకి రావడం ఖాయమే అని సమాచారం. తాజా ఇంటర్వ్యూలో రీతూ చౌదరి, విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చారు.
    బిగ్ బాస్ షోపై ఎన్ని విమర్శలు ఉన్నా... ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో సీజన్ 7 సరికొత్తగా రూపొందించి మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా సీజన్ 7 టీఆర్పీ రాబట్టింది. స్టార్ మా యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు.
    టాస్క్స్, గేమ్స్, రూల్స్ మార్చడం కూడా ప్లస్ అయ్యింది. సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 కూడా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌస్లు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. కంటెస్టెంట్స్ లూప్ హౌస్ నుండి మెయిన్ హౌస్లోకి రావాల్సి ఉంటుందట.
    మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. అమృత ప్రణయ్, నటుడు అలీ తమ్ము ఖయ్యూమ్ అలీ, మై విలేజ్ షో అనిల్, స్వాతి నాయుడు, సోనియా సింగ్, కుమారీ ఆంటీ ఎంపిక అయ్యారని తెలుస్తోంది. వేణు స్వామి, వినోద్ కుమార్, అంబటి రాయుడు, అబ్బాస్, నటుడు రోహిత్.. ఇలా కొన్ని క్రేజీ నేమ్స్ కూడా తెరపైకి వచ్చాయి.
    హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడం ఖాయమే అంటున్నారు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. జంటగా విందులు, విహారాలు ఎంజాయ్ చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంటారు. తాజాగా రీతూ చౌదరి, విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
    మీరిద్దరూ బిగ్ బాస్ హౌసులోకి వెళుతున్నారని గట్టి ప్రచారం జరుగుతుంది. దీనికి మీ ఆన్సర్ ఏమిటనగా?... బిగ్ బాస్ హౌస్లోకి వెళితే ఓ పది కేజీల బరువు తగ్గుతానేమో అని ఎదురు చూస్తున్నాను. నాకు బిగ్ బాస్ షోకి వెళ్ళాలని లేదు. కానీ ప్రేక్షక దేవుళ్ళ కోరిక ఫలిస్తే వెళతానేమో. నన్ను బిగ్ బాస్ హౌస్లో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రార్థనలు నిజమైతే నన్ను బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు... అని విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది.
    నాది కూడా సేమ్ ఆన్సర్ అని రీతూ చౌదరి పరోక్షంగా హింట్ ఇచ్చింది. వారి సమాధానాలను బట్టి చూస్తే బిగ్ బాస్ షోకి విష్ణుప్రియ, రీతూ చౌదరి దాదాపు ఎంపికయ్యారనిపిస్తుంది. సోషల్ మీడియాలో పొట్టిబట్టల్లో రెచ్చిపోయే వీరిద్దరూ హౌస్లోకి వెళితే... గ్లామర్ షోతో రచ్చ చేస్తారు అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ 8లో A సర్టిఫికెట్ కంటెంట్ గ్యారంటీ అని సోషల్ మీడియా జనాలు చెప్పుకుంటున్నారు.
    Stay informed with the latest news and updates from Andhra Pradesh, Telangana, India, and around the world. Explore breaking news in Tollywood, Politics, Business, Cricket, Technology, Automobiles, Lifestyle & Health, and Travel. Don't miss out on the top stories and in-depth coverage on www.telugu.asianetnews.com
    SUBSCRIBE OUR CHANNEL FOR UPDATES!
    Website ► telugu.asianetn...
    Facebook ► / asianetnewstelugu
    Twitter ► / asianetnewstl
    Insta ► / asianetnews.telugu
    Whastapp Channel ► whatsapp.com/c...

Комментарии •